తెరాసపై పోటీ చేస్తాం: జిఎస్ రావు
హైదరాబాద్: తెలంగాణపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అభిప్రాయం అవసరం లేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) తాత్కాలిక అధ్యక్షుడు జి.ఎస్. రావు అన్నారు. తెలంగాణపై తమ పార్టీ అధిష్ఠానవర్గం నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. దానికి పిసిసి అభిప్రాయం గానీ, ముఖ్యమంత్రి అభిప్రాయం గానీ అవసరం లేదని ఆయన అన్నారు. తెలంగాణపై తమ పార్టీ నాయకురాలు సోనియా గాంధీయే నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు.
మార్చి 6వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రజాప్రతినిధులు రాజీనామా చేయడం వల్ల తమకు నష్టమేమీ లేదని, ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే తామే గెలుస్తామని ఆయన అన్నారు. తెరాసపై కాంగ్రెస్ పోటీ చేస్తుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications