విద్యార్థి కాల్పులు: ఐదుగురు మృతి
చికాగో: అమెరికాలోని చికాగో నగరం సమీపంలో ఉన్న ఇలినాయిస్ యూనివర్శిటీలో ఉన్మాది కాల్పులు జరిపిన సంఘటనలో ఐదుగురు బలి కాగా, పలువురు గాయాలపాలయ్యారు. ఆ యూనివర్శిటీ క్యాంపస్‌లో 100 మంది విద్యార్థులతో ఉన్న ఓ క్లాస్ రూంలోకి ఆకస్మీకంగా ఓ ఉన్మాది రెండు చేతుల్లో తుపాకులతో వచ్చి విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు.
అనంతరం అతను కూడా కాల్చుకుని హతమైనట్టు వారు పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో మృతి చెందిన విద్యార్థుల్లో నలుగురు మహిళలు ఉన్నట్టు పోలీసూలు తెలిపారు. ఈ కాల్పుల్లో 18 మంది విద్యార్థు లు గాయాలపాలయ్యారు. వారినందరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు వారు వెల్లడించారు.












Click it and Unblock the Notifications
