తెలంగాణపై ఐబి నివేదిక వట్టిదే: జానా

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఇస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ఇంటలిజెన్స్ ఏ విధమైన నివేదిక ఇవ్వలేదని హోం మంత్రి కె. జానారెడ్డి శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. అటువంటి నివేదికలు ఇచ్చినప్పుడు చత్తీస్ ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఆగాయా, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అటువంటి నివేదికలేవీ అపలేవని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే నక్సలైట్ల సమస్య తలెత్తుతుందని ఇంటలిజెన్స్ నివేదిక ఇచ్చినట్లు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గురువారం శాసనసభలో చెప్పిన విషయం తెలిసిందే. తెలంగాణ ఇస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ఇంటలిజెన్స్ నివేదిక ఇచ్చిన మాట వాస్తవమేమని సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎం. సత్యనారాయణ రావు శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కరీంనగర్ లోకసభ ఉప ఎన్నికకు ముందు ఈ నివేదిక ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ అంశాన్ని కాశ్మీర్ సమస్యతో ముఖ్యమంత్రి పోల్చడం సరి కాదని ఆయన అన్నారు.

ప్రభుత్వమే మత కల్లోలాలను సృష్టించడానికి ప్రయత్నిస్తోందనే విమర్శలు బాధ్యతారాహిత్యమని జానా రెడ్డి అన్నారు. అవి నిరాధారమైన విమర్శలని అన్నారు. అలాంటి ప్రకటనలు చేసేవారిపై కూడా జాగురూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం అటువంటి ప్రయత్నాలను తిప్పికొడుతుందని ఆయన అన్నారు. అయేషా హత్య కేసులో తాము ఎవరినీ దాచాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారని ఆయన అన్నారు. అయేషా హత్య కేసులో ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+