పెట్రోల్ ధరల పెంపు స్వల్పమే: ప్రధాని

ముడిచమురు దిగుమతి ధరలు పెరిగిన పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వామపక్షాలు, ప్రతిపక్షాలు ఈ ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తుండడంపై ప్రధాని మాట్లాడుతూ ఈ ధరల పెరుగుదల స్వల్పమేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం గురువారం పెట్రోల్ ధరలను లీటరుకు రూ.2, డీజిల్ ధరను లీటరుకు రూ.1 పెంచిన సంగతి తెలిసిందే. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని వామపక్షాలతో పాటు ప్రతిపక్ష బీజేపీ వ్యతిరేకిస్తున్నాయి. ఈ ధరల పెంపు సామాన్యుడిపై ప్రభావం చూపుతుందని అవి అంటున్నాయి.












Click it and Unblock the Notifications
