తెలంగాణపై వైయస్ వంకర: చాడ
హైదరాబాద్: తెలంగాణపై ముఖ్యమంత్రి అడ్డూ నిలువూ కాదు, వంకర లేకుంటే చాలునని సిపిఐ శాసనసభా పక్ష నాయకుడు చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. తాను తెలంగాణకు అడ్డూ లేను, నిలువూ లేనని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యపై ఆయన శుక్రవారం శాసనసభలో ఆ విధంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ అంశాన్ని ఎంత కాలం నానుస్తారో చెప్పండని ఆయన కాంగ్రెసును అడిగారు. తెలంగాణ అంశం పరిష్కారం కాదని ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పారని ఆయన అన్నారు. చావు కబురు చల్లగా చెప్పారని ఆయన అన్నారు.
తెలంగాణ ఇవ్వకపోతే ఏకాభిప్రాయంతో ఇస్తామని యుపిఎ కనీస ఉమ్మడి కార్యక్రమంలో ఎందుకు పెట్టారని, రాష్ట్రపతి ప్రసంగంలో ఎందుకు చేర్చారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణపై యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటారని అనడాన్ని ఆయన తప్పు పట్టారు. ముఖ్యమంత్రి అభిప్రాయం లేకుండా సోనియా నిర్ణయం తీసుకుంటారా అని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications
