కక్ష్య తప్పిన అమెరికా ఉపగ్రహం పేల్చివేత
వాషింగ్టన్ : కక్ష్యలో నియంత్రణ కొల్పోయి భూమిపై పడడానికి సిద్ధమైన ఓ కృత్రిమ ఉపగ్రహాన్ని అమెరికా బుధవారం విజయవంతంగా పేల్చివేయగలిగింది. ఈ ఉపగ్రహంలోని ఇంధనం భూమిపై పడకుండా చేయడం కోసం అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.
పసిఫిక్ మహాసముద్రంపై నిలిపిన ఓ భారీ నౌక నుంచి క్షిపణిని ప్రయోగించడం ద్వారా అమెరికా ఈ ఉపగ్రహాన్ని పేల్చి వేయగలిగిందని అధికారులు తెలిపారు.
కక్ష్య తప్పి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తున్న ఈ ఉపగ్రహంలోని ఇంధనం ప్రమాదకరమైనది కావడంతో అది భూమిపై పడకుండా ఉండేందుకు ఉపగ్రహాన్ని పేల్చి వేసినట్టు వారు వివరించారు. పేలిపోయిన ఉపగ్రహం శకలాలు సమద్రంలో పడిపోనున్నాయని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications
