పాక్ ప్రధాని పదవిపై ఆశ లేదు: జర్దారీ
ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌కు కాబోయే కొత్త ప్రధాని అభ్యర్ధిని తాను కాదని పీపీపీ కో ఛైర్మన్ అసీఫ్ అలీ జర్దారీ ప్రకటించారు. తమ పార్టీలోని సీనియర్ నేతలకు ఆ అవకాశం కల్పించనున్నట్టు ఆయన తెలిపారు.
ఇస్లామాబాద్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు పేర్కొన్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో 87 సీట్లు సాధిచడం ద్వారా తమ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించిన సమయంలో ప్రధాని అభ్యర్ధి గురించి తాము ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
తాజాగా జరిగిన పాక్ ఎన్నికల్లో పీపీపీకి 87 సీట్లు లభించగా నవాజ్ షరీఫ్ పార్టీ అయిన పీఎమ్ఎల్-ఎన్‌కు 66 సీట్లు లభించాయి. దీంతో ఈ రెండు పార్టీలు కలిసి పాక్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరుపార్టీల నేతలు గురువారం పొత్తు విషయమై చర్చించడానికి సమావేశం కానున్నారు.












Click it and Unblock the Notifications
