స్త్రీ జాతిపై కేసీఆర్ వ్యాఖ్యలపై విమర్శల వర్షం
హైదరాబాద్: రాయలసీమ నేతలపై విమర్శలు చేసే క్రమంలో స్త్రీ జాతిని అవమానపరిచేలా టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వ్యాఖ్యలు చేయడాన్ని వివిధ రాజకీయ పార్టీలు దుయ్యబట్టాయి. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో పాటు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి.
రాయలసీమకు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యులు ప్రతాపరెడ్డి, రాంభూపాల్ రెడ్డి, మోహన్ రెడ్డి, వెంకటరమణలు మాట్లాడుతూ తెలంగాణా ప్రజల సంస్కృతికి విరుద్ధంగా దారుణమైన రీతిలో కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఆయనను సభకు రప్పించి, క్షమాపణలు చెప్పించాలని రాయలసీమ ఐక్య వేదిక చీఫ్ టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
