తెలుగుదేశం సైకిల్ ర్యాలీ పదో రోజుకు
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు తెలుగుదేశం పార్టీ చేపట్టిన సైకిల్ ర్యాలీ పదో రోజుకు చేరుకుంది. గురువారం ఖైరతాబాద్ లోని ప్రఖ్యాత గణేశ విగ్రహ ప్రాంగణం నుంచి ప్రారంభమైన సైకిల్ యాత్ర ఖైరతాబాద్ నియోజవర్గాన్నంతా దాదాపు కవర్ చేసింది.
కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, అవినీతి, పారిశుధ్యం పై అత్యధికంగా తమకు ఫిర్యాదులు వస్తున్న్నాయని తెలుగుదేశం నాయకుడు , మాజీ ఐపిఎస్ అధికారి విజయరామారావు అన్నారు. సైకిల్ యాత్రలు ప్రజా చైతన్యాన్న్ని పెంచుతాయని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
