మెడికల్ కోర్సుల్లో ఎస్సీ,ఎస్టీలకు రిజర్వేషన్
న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగనున్న మెడికల్, డెంటల్ కోర్సుల ప్రవేశాల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వశాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఈ విషయమై ఆరోగ్యమంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు మాట్లాడుతూ ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసిన అభ్యర్ధులకు ఈ రిజర్వేషన్లు వర్తింపజేయనున్నట్టు తెలిపారు. దీని ప్రకారం షెడ్యుల్ క్యాస్ట్ అభ్యర్ధులకు 15 శాతం రిజర్వేషన్లు, షెడ్యుల్ ట్రైబ్ అభ్యర్ధులకు 7.5 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు వారు చెప్పారు.
ఈ రిజర్వేషన్లను అమలు చేయడం ద్వారా ఈ ఏడాది 310 ఎస్సీ అభ్యర్ధులు, 155 మంది ఎస్టీ అభ్యర్దులు లబ్ధి పొందనున్నారని వారు వివరించారు.












Click it and Unblock the Notifications