రాజీనామా యోచనలో నరేంద్ర

న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై తాను కూడా రాజీనామా చేసే యోచనలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నుంచి సస్పెండ్ అయిన ఎ. నరేంద్ర ఉన్నారు. తెరాస లోకసభ సభ్యులు రాజీనామా చేసిన నేపధ్యంలో నరేంద్ర ఆ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణపై యుపిఎ ప్రభుత్వం మోసం చేసినందున రాజీనామా చేసి ప్రజల వద్దకు వెళ్లడమే మంచిదని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆయన తన సన్నిహితుల వద్ద అన్నట్లు సమాచారం.

తెలంగాణపై పార్లమెంటులో చర్చకు అవకాశం లేనందున ఆయన రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఈ విషయాన్ని ఆయన వెల్లడించలేదు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చకు ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన సమాధానంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభలో ప్రధాని సమాధానం తర్వాత నరేంద్ర రాజీనామా చేసే అవకాశం ఉంది. అయితే ఏ విధంగా నిరసన వ్యక్తం చేసి రాజీనామా చేయాలనే విషయంపై ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+