ఐదుగురు నక్సల్స్ లొంగుబాటు
వరంగల్: వరంగల్ జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (ఎస్పీ) సౌమ్యా మిశ్రా ముందు బుధవారనాడు ఐదుగురు నక్సలైట్లు లొంగిపోయారు. లొంగిపోయినవారిలో ఇద్దరు మహిళా నక్సలైట్లు ఉన్నారు. కాగా, ఐదుగురు నక్సలైట్లలో ముగ్గురు మావోయిస్టు దళ కమాండర్లు, ఒక దళ సభ్యుడు ఉన్నారు. మరొక నక్సలైట్ ప్రతిఘటన జోనల్ కమిటీ సభ్యుడు.
లొంగిపోయినవారిలో ఛత్తీస్ ఘడ్ కు చెందిన పున్నెం లక్ష్మి ఉంది. ఈమె దళ సభ్యురాలుగా చేరి దళ కమాండర్ స్థాయికి ఎదిగింది. ఈమె తన భర్తతో కలిసి ఎస్పీ ముందు లొంగిపోయింది. ప్రశాంత జీవనం గడపాలనే ఉద్దేశంతోనే తాను భర్తతో కలిసి పోలీసులకు లొంగిపోయినట్లు ఆమె తెలిపింది. లొంగిపోయిన నక్సలైట్లకు పునరావాసం కల్పిస్తామని సౌమ్యా మిశ్రా చెప్పారు.












Click it and Unblock the Notifications