హిల్లరీ, ఒబామాల మధ్య పోటాపోటీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష అభ్యర్ధి ఎంపిక కోసం కొనసాగుతోన్న ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ ఓహియో రాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించారు. పోటాపోటీగా సాగుతున్న ఈ ఎన్నికల ప్రక్రియలో హిల్లరీ ఓహియో స్థానంతో పాటు రోడాఐలాండ్‌లోను విజయం సాధించారు.
అదేసమయంలో కీలకమైన టెక్సాస్ రాష్ట్ర ఎన్నికల్లో హిల్లరీ ప్రత్యర్థి ఒబామా ముందజలో ఉన్నారు. అలాగే ఆయన వెర్మాంట్ స్థానంలో విజయం సాధించారు. మొత్తంగా చూస్తే మాత్రం హిల్లరీ కంటే ఒబామానే ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుని ఆధిక్యంలో ఉన్నారు. అయితే పెన్సిల్వేనియా ఎన్నికలు కీలకం కానున్నాయి. ఇదిలా ఉండగా రిపబ్లికన్ పార్టీ తరపున మెక్‌కెయిన్ అభ్యర్ధిత్వం ఖరారైంది. దీంతో రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరుపున మెక్‌కెయిన్ బరిలో దిగనున్నారు.












Click it and Unblock the Notifications