బారాక్ స్కామ్: నందాల అరెస్టు
న్యూఢిల్లీ: బారాక్ క్షిపణుల కుంభకోణంలో ఆయుధ వ్యాపారి సురేష్ నందాను సీబీఐ శనివారం రాత్రి అరెస్టు చేసింది. రక్షణ ఒప్పందాల్లో ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న సురేష్ నందాతో పాటు ఆయన కుమారుడు సంజీవ్ నందాను, మరో ఇద్దరిని కూడా అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు ఆదివారం చెప్పారు. గత ఏడాది ఆదాయ పన్ను శాఖ స్వాధీనం చేసుకున్న బ్యాంకు ఖాతా పుస్తకాలను తారుమారు చేసేందుకు కుట్ర పన్నినట్లు సీబీఐ వీరిపై అభియోగాలు మోపింది. ముంబయిలో గతరాత్రి వీరందరినీ అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
నందా, ఆయన కుమారుడుతో పాటు అరెస్టు అయిన వారిలో ఆదాయ పన్ను శాఖ డిప్యూటీ డైరెక్టర్ అషుతోష్ వెర్మా, చార్టెడ్ అకౌంటెంట్ బిపిన్ షాలు ఉన్నారు. 1999 బ్యాచ్‌కు చెందిన భారత రెవెన్యూ సర్వీసు అధికారి అయిన వర్మ గత ఏడాది ఫిబ్రవరిలో ఆదాయ పన్ను శాఖ దాడుల్లో స్వాధీనం చేసుకున్న అకౌంట్ పుస్తకాలను తారుమారు చేసేందుకు నందాలకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. నందా, అతని కుమారుడు సంజీవ్ నందా (బీఎండబ్ల్యూ కారు ప్రమాద కేసులో ప్రధాన నిందితుడు), వర్మా, షాలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని సీబీఐ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications
