వ్యోమింగ్ లో హిల్లరీపై ఒబామా విజయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థి ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ తరపున పోటీ పడుతున్న బరాక్ ఒబామా శనివారం వ్యోమింగ్‌లో హిల్లరీ క్లింటన్‌పై విజయం సాధించారు. వ్యోమింగ్ ఎన్నికల్లో ఒబామాకు 58 శాతం ఓట్లు రాగా, క్లింటన్‌కు 41 శాతం ఓట్లు లభించాయి. వ్యోమింగ్ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60 వేల మంది డెమొక్రాట్లు (96 శాతం) ఈ అభ్యర్థి ఎన్నికల్లో పాల్గొన్నారు.
డెమొక్రాట్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్, బరాక్ ఒబామాల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. అంతకుముందు మంగళవారం జరిగిన నాలుగు ఎన్నికల్లో హిల్లరీ మూడింటిలో విజయం సాధించగా, ఒబామా ఒకచోట విజయాన్ని చేజిక్కించుకున్నారు. ఇదిలా ఉంటే రిపబ్లికన్ పార్టీ తరపున ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా జాన్ మెక్‌కెయిన్ ఎన్నికయిన సంగతి విదితమే.












Click it and Unblock the Notifications
