దత్తాత్రేయ సహా పలువురి అరెస్టు

హైదరాబాద్: సుందరయ్య విజ్ఞాన కేంద్రంపై తామే దాడి చేసినట్లు సిపియం చేస్తున్న ఆరోపణను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకులు, కార్యకర్తలు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ హైదరాబాదులోని ఇందిరా పార్కు నుంచి శాసనసభ వైపు జరిగింది. బిజెపి నేతలను, కార్యకర్తలను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు.

బారికేడ్లను తొలగించి బిజెపి కార్యకర్తలు శాసనసభ వైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, ఎన్. ఇంద్రసేనారెడ్డిలతో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంపై తాము దాడి చేయలేదని, ఈ విషయంలో తాము ఏ విచారణకైనా సిద్ధమని బిజెపి శాసనసభ్యుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. సిపియం తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+