గడువు ప్రకారమే ఎన్నికలు: సోనియా

రైతులను లక్ష్యంగా చేసుకొని వరాలు కురిపించిన ఇటీవలి కేంద్ర బడ్జెట్ విశేషాలను ఆమె తన ప్రసంగంలో ప్రస్తావించారు. సాధారణ పౌరులకు లబ్ది చేకూరే విధంగా యూపీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సోనిగా గాంధీ కోరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను నిరాశపరిచిన మాట వాస్తవమేనని, అయితే వాటిని అనుభవంగా స్వీకరించి వచ్చే శాసనసభ ఎన్నికల్లో విజయానికి కృషి చేయడం అవసరమని ఆమె అన్నారు. అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహించాలని, అసెంబ్లీ ఎన్నికల్లో ఐకమత్యాన్ని, క్రమశిక్షణను చాటాలని సోనియా ఎంపీలను కోరారు.












Click it and Unblock the Notifications
