సుందరయ్య కేంద్రంపై దాడి: వైయస్ ఖండన
న్యూఢిల్లీ: హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంపై దాడిని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఖండించారు. ఒక పార్టీ జరుపుతున్న సమావేశ స్థలానికి మరో పార్టీ వెళ్లడం మంచిది కాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంపై దాడి సంఘటనపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంపై సోమవారం రాత్రి దాడి జరిగింది. బిజెపి, ఆరెస్సెస్ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని సిపియం ఆరోపిస్తోంది.
ఢిల్లీలో సిపియం సమావేశం జరుగుతుండగా బిజెపి, ఆరెస్సెస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని కూడా ఆయన ఈ సందర్బంగా ప్రస్తావించారు. ఈ నెల 14వ తేదీన తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్ర పర్యటన సందర్భంగా బిజెపి బంద్ కు పిలుపు ఇవ్వడాన్ని ఆయన తప్పు పట్టారు. ఏ పార్టీ కార్యక్రమాలు ఆ పార్టీ నిర్వహించుకుంటుందని, ఒక పార్టీ కార్యక్రమాలకు మరో పార్టీ నిరసనలు తెలపడం సరైంది కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
