జైపాల్ విందులో కాకాతో వైయస్

విందులో జైపాల్ రెడ్డి, రాజశేఖర రెడ్డి, పార్లమెంటు సభ్యులు జి. వెంకటస్వామి, వి. హనుమంతరావు, కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఒకే చోట కూర్చున్నారు. పార్టీ మునిగితే అందరం మునిగిపోతామని, పార్టీ బలోపేతంగా ఉంటేనే మనందరం బలంగా ఉంటామని రాజశేఖర రెడ్డి అన్నారు. అందరం కలిసి పార్టీని బలోపేతం చేద్దామని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తే పార్టీ బలోపేతం అవుతుందని వెంకటస్వామి అన్నారు. మనం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు. తెలంగాణ సభలకు తమను కూడా పిలవాలని ఆమె అన్నారు. తెలంగాణపై తన అభిప్రాయాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రధాని మన్మోహన్ సింగ్ కు మాత్రమే చెప్తానని, బహిరంగ ప్రకటనలు చేయనని జైపాల్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications
