ఎయిర్ పోర్టుకు తెలంగాణ పేరు: టిడిఎఫ్
హైదరాబాద్: హైదరాబాదు సమీపంలోని శంషాబాదులో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయానికి తెలంగాణ అంతర్జాతీయ విమానాశ్రయం అనే పేరు పెట్టాలని అమెరికాలోని తెలంగాణ ఎన్నారైల సంస్థ తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం డిమాండ్ చేసింది. ఈ విమానాశ్రయం పేరును తెలంగాణ ప్రజాప్రతినిధులు, తెలంగాణ ప్రజలు నిర్ణయించాలని ఫోరం అధ్యక్షుడు మధు కె. రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
తెలంగాణకు, తెలంగాణ వాసులకు వేలాది సంవత్సరాల చరిత్ర ఉందని, శంషాబాద్ విమానాశ్రయం పేరుపై రాజకీయ నాయకులు తగాదాలు పడడం హాస్యాస్పదంగా ఉందని, వారి ఉద్దేశాలే అందుకు కారణమని ఆయన అన్నారు. తెలంగాణ పేరు కోసం తెలంగాణ ప్రజాప్రతినిధులు పోరాటం చేయాలని ఆయన కోరారు. తెలంగాణకు అన్యాయం చేసిన వ్యక్తుల పేర్లు పెట్టడం అభ్యంతరకరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications