సంతోషి హత్య కేసు: నిందితుల గుర్తింపు
విశాఖపట్నం: సంతోషి అనే అమ్మాయి హత్య కేసులో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు. సంతోషి అనే అమ్మాయి ఈ నెల 1వ తేదీన అదృశ్యమైంది. ఆమె మృతదేహం 10వ తేదీన కనిపించింది. అప్పటి నుంచి పోలీసులు ఆమె హత్య కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఎట్టకేలకు నిందితులను గుర్తించారు.
సంతోషిని నమ్మించి తీసికెళ్లి గణేష్ అనే వ్యక్తి ఆమెపై అత్యాచారం జరిపి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సంతోషిని ప్రేమిస్తున్నట్లు నటిస్తూ ఆమెకు ఇదివరకు ఒకసారి గర్భం చేసి అబార్షన్ చేయించినట్లు చెబుతున్నారు. సంతోషి హత్యలో సత్యనారాయణ అనే వ్యక్తి, లోకేష్ అనే ఆటో డ్రైవర్ సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. గణేష్ గతంలో కూడా ఒక కేసులో నిందితుడు.












Click it and Unblock the Notifications