రవితేజ డూప్ మృతిపై దర్యాప్తు
రాజమండ్రి: సినీ హీరో రవితేజ డూప్ మహేందర్ మృతిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రవితేజ డూప్ మహేందర్ షూటింగ్ సమయంలో గోదావరి నదిలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించినవారిపై చర్యలు తప్పవని తూర్పు గోదావరి జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (ఎస్పీ) శ్రీనివాసులు చెప్పారు.
దేవీపట్నం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఎస్పీ శ్రీనివాసులు కేసు దర్యాప్తును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. యూనిట్ నిర్లక్ష్యంపై, నీటి పారుదల శాఖ బాధ్యతపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహేందర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదీ తీరాన షూటింగ్ జరుగుతుండగా రవితేజ డూప్ మహేందర్ నదిలో పడి మరణించాడు.












Click it and Unblock the Notifications