సెన్సెక్స్ భారీ పతనం

ముంబయి: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) సోమవారం ఉదయం అంతర్జాతీయ మార్కెట్‌ల ప్రతికూల ప్రభావంతో భారీ పతనాన్ని చవిచూసింది. ఉదయం లావాదేవీల్లో భయంకరమైన అమ్మకాలు జరగడంతో సెన్సెక్స్ 747.36 పాయింట్లు పతనం అయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 645 పాయింట్ల నష్టంతో 15115 వద్ద కొనసాగుతోంది. సోమవారం ఉదయం 10.41 గంటల సమయంలో బీఎస్ఈ సూచి సుమారు 750 పాయింట్ల (4.74%) రికార్డు స్థాయి పతనంతో 15,013.16 పాయింట్లకు చేరింది. గత ఏడాది ఆగస్టు 29న తరువాత సెన్సెక్స్‌కు ఇదే భారీ పతనం. ఆరోజు సెన్సెక్స్ 4.9 శాతం పతనమై 14,995.15 కనిష్ట స్థాయిని చూసింది.

ఇదిలా ఉంటే నేషనల్ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (నిఫ్టీ) కూడా సోమవారం నష్టాల బాటలో నడుస్తోంది. ప్రారంభం అయిన తొలి ఐదు నిమిషాల్లోనే నిఫ్టీ 200.15 పాయింట్లు కోల్పోయి 4,545.65కు చేరుకుంది. ప్రస్తుతం నిఫ్టీ 175 పాయింట్లు పతనమై 4571 వద్ద కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+