టిడిపి మూకుమ్మడి రాజీనామాలు?
హైదరాబాద్: శాసనసభలో స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి ఏకపక్ష వైఖరికి నిరసనగా మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడే దిశలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఆలోచిస్తున్నారు. స్పీకర్ ప్రధాన ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది. స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించే విషయాన్ని ఆలోచిస్తున్నామని చంద్రబాబు సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. స్పీకర్ తమ గొంతు నొక్కుతున్నారని ఆయన విమర్శించారు. స్పీకర్ పదవికి సురేష్ రెడ్డి మచ్చ తెచ్చారని ఆయన వ్యాఖ్యానించారు.
మూకుమ్మడి రాజీనామాలు చేయాలా, స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలా అనే విషయాన్ని చంద్రబాబు తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చర్చకు పట్టుపడితే తమను సస్పెండ్ చేస్తున్నారని, లేదంటే సభను వాయిదా వేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు చంద్రబాబునాయుడు పదే పదే విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications