అసెంబ్లీ నుంచి టిడిపి, సిపియం వాకౌట్
హైదరాబాద్: పింఛన్ల పంపిణీలో అక్రమాలపై తెలుగుదేశం, సిపియం సభ్యులు సోమవారం శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తెలుగుదేశం సభ్యుడు నరేందర్ రెడ్డి ఒక్క వరంగల్ కార్పోరేషన్ లోనే 36 వేల పింఛన్లు పంచగా, 14 వేల పింఛన్లు బోగస్ అని తేలిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని విమర్శించారు. ప్రభుత్వ సమాధానంతో సంతృప్తి చెందని తెలుగుదేశం, సిపియం సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
ఇటువంటి భారీ పథకంలో లోపాలు జరగడం మామూలేనని, లోపాలను గుర్తించి సరి చేస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. త్వరలో స్మార్ట్ కార్డులు ప్రవేశపెడ్తామని ఆయన చెప్పారు. లోపాలను గుర్తించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 45 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తే తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు పందికొక్కుల్లా ఎలా తిన్నారో అందరికీ తెలుసునని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications