బలహీనవర్గాల రుణాల మాఫీ: వైయస్
హైదరాబాద్: అన్ని బలహీనవర్గాలకు ఇచ్చిన లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రకటించారు. బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల రుణాలను రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మొత్తం 1690 కోట్ల రూపాయలు ఉంటుందని ఆయన సోమవారం శాసనసభలో చెప్పారు. దీనివల్ల 43,84,682 మంది లబ్ధి పొందుతారని ఆయన చెప్పారు.
అన్ని సంక్షేమ కార్పోరేషన్లకు అదనంగా 50 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. అన్ని సంక్షేమ కార్పోరేషన్ల ద్వారా ఔత్సాహిక బలహీనవర్గాలకు చెందినవారికి రుణాలు ఇప్పించనున్నట్లు, ఒక్కో యూనిట్ పరిమితి పది లక్షల రూపాయలని ఆయన చెప్పారు. పది లక్షల రూపాయలకు పైగా రుణాలు తీసుకునేవారికి మిగతా మొత్తాన్ని వాణిజ్య సంస్థల నుంచి, ఇతర సంస్థల నుంచి సమకూరుస్తామని ఆయన చెప్పారు. సంక్షేమ కోర్పోరేషన్ల నుంచి తీసుకునే రుణాలపై సబ్సిడీని పది వేల రూపాయల నుంచి 30 వేల రూపాయలకు పెంచుతున్నట్లు ఆయన చెప్పారు. కార్పోరేషన్ల ద్వారా రుణాలు తీసుకునేవారికి ప్రభుత్వమే పూచీకత్తు ఇస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications