పెట్టుబడులతో రండిః ఎన్నారైలకు వైఎస్ పిలుపు

క్యాంప్ కార్యాలయంలో ఆదివారం తనను కలసిన ప్రవాసాంధ్ర ఔత్సాహిక పారిశ్రామికవేత్తల మధ్య ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటు ద్వారా రాష్ట్రం మరింత ఆర్థిక వృద్ధి సాధించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
మౌలిక సదుపాయాల కల్పనలో త్వరలోనే రాష్ట్రం అగ్రస్థానానికి చేరుకోగలదని చెప్పారు. ప్రస్తుతం ఆ విషయంలో ముందున్న గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడులను వెనక్కు నెట్టగలమన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే పారిశ్రామిక పెట్టుబడులు పెరుగుతున్నందున యువతకు చక్కటి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రం రూ. 25173 కోట్ల ప్రతిపాదనలతో దేశంలోనే గుజరాత్ తర్వాత రెండో స్థానంలో ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications