మధుయాష్కీపై కోర్టుకెక్కుతా: గోనె
విజయవాడ: తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ గౌడ్ నకిలీ ధ్రువపత్రాలపై కోర్టుకెక్కనున్నట్లు కాంగ్రెస్ నాయకుడు గోనె ప్రకాశరావు చెప్పారు. మధుయాష్కీ కుటుంబం నకిలీ ధ్రువపత్రాలతో అమెరికా వెళ్లారని ఆయన గత కొంతకాలంగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. మధుయాష్కీ నకిలీ ధ్రువపత్రాలపై ఎల్లుండి (బుధవారం) హైదరాబాదులోని నాంపల్లి క్రిమినల్ కోర్టులో కేసు వేయనున్నట్లు ఆయన తెలిపారు. మధుయాష్కీ కుటుంబ సభ్యులు అమెరికా నుంచి తనను బెదిరిస్తున్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.
మధుయాష్కీ నకిలీ ధ్రువ పత్రాలపై పోలీసులు గానీ, ప్రభుత్వం గానీ న్యాయం చేయడం లేదని, అందుకే తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. తనకు పోలీసు అధికారులపై విశ్వాసం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications