కారత్ బాబు భేటీకి ప్రాధాన్యం లేదు: బీవి

తమ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబునాయుడిని కలిసిన విషయానికి అంత ప్రాధాన్యత లేదని ఆయన చెప్పారు. వారిద్దరి మధ్య రాజకీయాలకు సంబంధించిన చర్చలు జరిగితే జరిగి ఉండవచ్చునని, అయితే వాటికి అంత ప్రాధాన్యం లేదని ఆయన అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాల గురించి చర్చించి ఉంటే తప్పకుండా రాష్ట్ర నాయకులు చర్చల్లో ఉండేవారని ఆయన అన్నారు. రాష్ట్రంలో బిజెపి బలం పుంజుకోవాలని, కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తోందని, అందువల్ల ఆ పార్టీని నిలువరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications