గొడవలు సహజం: పురుషోత్తమ రెడ్డి
హైదరాబాద్: గొడవలు సహజమని, తమ సీనియర్లం మళ్లీ కలుస్తామని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి అన్నారు. భువనగిరి సభ వాయిదాపై పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి, తదితరులతో తనకు ఏర్పడిన విభేదాలపై ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల వద్ద ఆ విధంగా వ్యాఖ్యానించారు. తామంతా కాంగ్రెస్ వాళ్లమని, తాము కలుస్తాం, విడిపోతామని ఆయన అన్నారు. వాటికి అంత ప్రాధాన్యం అవసరం లేదని ఆయన అన్నారు.
కాంగ్రెస్ సీనియర్ల గొడవలు పార్టీ వ్యూహంలో భాగమేననే వ్యాఖ్యలను ఆయన ఖండించారు. విభేదాలు వ్యూహాత్మక ఎత్తుగడ కాదని, అలా అయితే బాగానే ఉండేదని ఆయన అన్నారు. విభేదాలతో వేరైన తాము ఎప్పుడైనా కలుసుకోవచ్చునని, ఇందులో పెద్ద విశేషమేమీ లేదని ఆయన అన్నారు. సీనియర్ల సమావేశాలకు పురుషోత్తమ రెడ్డి హాజరు కావడం లేదు.












Click it and Unblock the Notifications