టిడిపికి శృంగభంగం తప్పదు: మారెప్ప
హైదరాబాద్: రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిది అదే పరిస్థితి అని మంత్రి మారెప్ప అన్నారు. ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం విషయంలో తెలుగుదేశం పార్టీకి శృంగభంగం తప్పదని ఆయన అన్నారు.
ప్రభుత్వ అవినీతిని బయట పెట్టలేదని తెలుగుదేశం పార్టీ శాసనసభలో తిట్టుకోవడానికి అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలుగుదేశం పార్టీది లైసెన్స్ గలిగిన న్యూసెన్స్ అని, తెలుగుదేశం పార్టీకి సెన్స్, సిన్సియారిటీ లేవని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications