వైయస్ హామీతో ఆందోళన విరమణ
హైదరాబాద్: ఎస్సై ఉద్యోగాలకు వయోపరిమితిని పెంచాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనను ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు విరమించారు. ఎస్సై ఉద్యోగాలకు వయో పరిమితిని 25 ఏళ్ల నుంచి 30 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు శుక్రవారం ఆందోళనకు దిగారు. తమ డిమాండ్ ను అంగీకరించకపోతే కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంటామని కొందరు విద్యార్థులు ఆర్ట్స్ కాలేజీపైకి ఎక్కి బెదిరించారు. ముఖ్యమంత్రి హామీతో వారు కాలేజీ పై నుంచి దిగి వచ్చారు.
ఎట్టకేలకు విద్యార్థులను ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చర్చలకు ఆహ్వానించారు. రేపు మధ్యాహ్నం విద్యార్థులు ముఖ్యమంత్రితో చర్చలు జరుపుతారు. తమ డిమాండును అంగీకరిస్తేనే ఆందోళన విరమిస్తామని మొండికేసిన విద్యార్థులు ఎట్టకేలకు మెట్టు దిగి చర్చలకు వస్తామని చెప్పి ఆందోళన విరమించారు. ఎస్సీ అభ్యర్థుల వయోపరిమితిని కూడా పెంచాలని చర్చల్లో డిమాండ్ చేస్తామని విద్యార్థి నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications