తర్వాతే చిరుతో పొత్తు ఆలోచన: సిపిఐ
గుంటూరు / హైదరాబాద్: విధివిధానాలను చూసిన తర్వాతనే మెగాస్టార్ చిరంజీవి పెట్టే పార్టీతో పొత్తుపై ఆలోచిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ గుంటూరులో అన్నారు. చిరంజీవి పార్టీని తాము స్వాగతిస్తున్నామని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసుల ఏకఛత్రాధిపత్యం పోవాలని, అందుకు రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయం అవసరమని ఆయన అన్నారు. కొత్త పార్టీలు రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) బలం తగ్గిందని ఆయన అన్నారు. టీఆర్ఎస్ రాజీనామాలు రాజకీయ ఎత్తుగడ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు ఐదేళ్ల కోసం ఎన్నుకున్న తర్వాత టీఆర్ఎస్ రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లడం హాస్సాస్పదమని ఆయన అన్నారు. చిరంజీవి పెట్టే పార్టీ లౌకిక పార్టీ అయితే తాము స్వాగతిస్తామని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. చిరంజీవి మతతత్వ పార్టీలతో పొత్తు పెట్టుకోకూడదని ఆయన అన్నారు. చిరంజీవి పార్టీ పెట్టి బిజెపితో అవగాహనకు రావచ్చుననే వార్తలు వస్తున్న నేపథ్యంలో రాఘవులు హైదరాబాదులో ఆ వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications