సోనియా తలిస్తే వైయస్ ఆపలేరు: విహెచ్
హైదరాబాద్: తనకు మంత్రి పదవి రాకపోవడానికి అనేక కారణాలున్నాయని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. కేంద్ర మంత్రి పదవిపై ఆయన చాలా కాలంగా ఆశలు పెట్టుకున్నారు. ఈసారి కూడా ఆయనకు నిరాశే ఎదురైంది. తనకు మంత్రి పదవి ఇవ్వాలని సోనియా గాంధీ అనుకుంటే ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అపగలరా అని ఆయన ప్రశ్నించారు.
హైదరాబాదులో ఉన్న హనుమంతరావుకు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ఫోన్ చేశారు. మంత్రి పదవి ఈసారి ఇవ్వలేకపోతున్నామని ఆయన చెప్పి హనుమంతరావుకు సారీ చెప్పారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఎవరకీ చోటు దక్కే అవకాశం లేదు.












Click it and Unblock the Notifications