మసాజ్ సెంటర్ నిర్వాహకుడి అరెస్టు
హైదరాబాద్: హైదరాబాదులోని మాదాపూర్ పరిధిలో మసాజ్ నిర్వహిస్తున్న ఇంజనీర్ మోహన్ ను ఆదివారంనాడు పోలీసులు అరెస్టు చేశారు. మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడనే ఆరోపణపై పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. పోలీసులు ఈ నెల 15వ తేదీన రెండు మసాజ్ సెంటర్లపై దాడులు నిర్వహించి పది మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో మసాజ్ సెంటర్ల నిర్వాహకులు పారిపోయారు.
పరారీలో ఉన్న ఒక మసాజ్ సెంటర్ నిర్వాహకుడు మోహన్ ను పోలీసులు ఆదివారంనాడు అరెస్టు చేశారు. మరో మసాజ్ సెంటర్ నిర్వాహకుడు ఇంకా పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫిజియోథెరపి పేరు మీద మోహన్ వ్యభిచారం నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications