మహిళా సిఐ ఇంట్లో ఎసిబి సోదాలు
హైదరాబాద్: ఆబ్కారీ మహిళా సర్కిల్ ఇన్సెపెక్టర్ లక్ష్మి ఇంటిలో, ఆమె బంధువుల ఇంటిలో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 12 లక్షల రూపాయల నగదుతో పాటు వివిధ ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభించాయి. హైదరాబాదులోని సంతోష్ నగరులో గల లక్ష్మి ఇంటిలోనూ, వివిధ చోట్ల ఉన్న ఆమె సన్నిహితుల ఇళ్లలోనూ ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు.
సోదాల్లో 12 ఎకరాల బత్తాయి తోట, ప్లాట్లు ఉన్నట్లు తేలిందని ఎసిబి అధికారులు చెప్పారు. నల్లగొండ జిల్లాకు చెందిన లక్ష్మి 1987లో జూనియర్ అసిస్టెంటుగా ఆబ్కారీ శాఖలో చేరారు. 1992లో ఎస్సైగా ప్రమోట్ అయ్యారు. ఆ తర్వాత సిఐగా ప్రమోట్ అయ్యారు. గోల్కొండ సిఐగా పని చేస్తున్న కాలంలో లక్ష్మిపై ఫిర్యాదులు అందాయి. దాంతో ఎసిబి అధికారులు ఈ దాడులు నిర్వహించారు. అయితే ఇవన్నీ తమ అత్తామామలు సంపాదించిన అస్తులని లక్ష్మి చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
