కెసిఆర్ కార్తకర్తల్లో నేనొక్కడ్ని: రామ్

హైదరాబాద్: తాను కచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంటు సభ్యుడినో, శాసనసభ్యుడినో కావాలని తనకేమీ లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు, ఆ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు కుమారుడు తారకరామారావు స్పష్టం చేశారు. తాను పోటీ చేస్తే తెలంగాణ ఉద్యమానికి లాభమని పార్టీ నాయకత్వం భావిస్తే పోటీ చేస్తానని, పోటీ చేయకపోతే లాభమనుకుంటే పోటీ చేయకుండా ఉంటానని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

కెసిఆర్ నాయకత్వంలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్యకర్తల్లో తానొకడినని ఆయన అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ప్రస్తుతానికి తనకు లేదని ఆయన అన్నారు. తమ పార్టీ మాజీ శాసనసభ్యుడు హరీష్ రావుకు, తనకు మధ్య ఏ విధమైన విభేదాలు లేవని, సిద్దిపేట నుంచి తనను మారుస్తారనే వార్తలపై హరీష్ రావు కూడా స్పష్టంగా చెప్పారని ఆయన అన్నారు. హరీష్ రావు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+