తాళ్లపాకలో అన్నమాచార్య జయంతి
కడప: కడప జిల్లా తాళ్లపాక పద కవితా హితామహుడు అన్నమాచార్య 600వ జయంతి ఉత్సవాలతో కళకళలాడింది. వంద మందికి పైగా కళాకారులు అన్నమాచార్య సంకీర్తలను ఆలపించి తమ భక్తిని చాటుకున్నారు. వేలాది మంది భక్తులు అన్నమాచార్య సంకీర్తనల గానామృతంలో ఓలలాడారు. తాళ్లపాకకు ఆధ్యాత్మిక కళను తెచ్చారు.
కుల అసమానతలను వ్యతిరేకించిన అన్నమాచార్య గొప్ప సంఘసంస్కర్త అని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్ కరుణాకర్ రెడ్డి అన్నారు. తాళ్లపాకను అంతర్జాతీయ స్థాయి సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. తిరవయ్యూరులో జరిగే త్యాగరాజ ఆరాధానోత్సవాల కన్నా ఘనంగా తాళ్లపాకలో ఏటా అన్నమాచార్య ఆరాధనోత్సవాలను నిర్వహిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications