తెలుగు విద్యార్థుల హత్య: 3గురు అరెస్టు
హైదరాబాద్: అమెరికాలోని లూసియానా విశ్వవిద్యాలయంలో ఇద్దరు తెలుగు విద్యార్థుల హత్య కేసు ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ హత్యకు కారణమైన ముగ్గురు అమెరికా నల్ల జాతీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన అల్లం కిరణ్ కుమార్, కర్నూలు జిల్లాకు చెందిన చంద్రశేఖర రెడ్డి నిరుడు ఆగస్టు 13వ తేదీన లూసియానా విశ్వవిద్యాలయంలోని హాస్టల్ గదిలో హత్యకు గురయ్యారు.
ఈ కేసును ఛేదించడానికి ఎఫ్ బిఐ ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఒక దొంగతనం కేసులో పోలీసులు అరెస్టు చేసినప్పుడు వీరికి తెలుగు విద్యార్థుల హత్యతో సంబంధం ఉందని పోలీసుల విచారణలో తేలింది. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు అందిస్తామని పోలీసులు చెప్పారు. తెలుగు విద్యార్థులను హత్య చేసినవారు దోపిడీకే వచ్చినట్లు భావిస్తున్నారు. హత్యకు గురైన ఇద్దరిలో అల్లం కిరణ్ కుమార్ ప్రముఖ రచయిత అల్లం రాజయ్య కుమారుడు.












Click it and Unblock the Notifications