బంగారం ధరల విస్ఫోటం
భారత్‌లో నేడు బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగాయి. యూఎస్ ట్రెజరీ ఈల్డ్‌లు పెరగడం, బలమైన డాలర్ దీనికి గల కీలక కారణాలు. డ్రైవింగ్ ఫోర్స్ గా పనిచేశాయవి. ఫలితంగా పసిడి రేట్లల్లో పెరుగుదల కనపించింది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,59,050 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,43,960గా రికార్డయింది. ఈ ధరల్లో జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు లేవు.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో జూన్ 5 నాటి ఫ్యూచర్ కాంట్రాక్టులకు బంగారం 0.57 శాతం మేర పెరిగింది. 10 గ్రాములకు ₹1,58,675కి చేరింది. అదేసమయంలో వెండి ధర 0.80 శాతం మేర లాభపడింది. కిలో ఒక్కింటికి 2,67,969 రూపాయలు పలుకుతోంది. అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 0.3 శాతం వరకు తగ్గి 4,467.59 డాలర్లకు చేరుకోగా, జూన్ డెలివరీ యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.9 శాతం పడిపోయింది. 4,471.10 వద్ద ట్రేడ్ అయింది.

కామెక్స్ లో మార్చి 30 తర్వాత బులియన్ ధర ఇదే అత్యల్ప స్థాయి. డాలర్ ఆరు వారాల గరిష్ఠానికి, 10-సంవత్సరాల యూఎస్ ట్రెజరీ ఈల్డ్‌లు ఒక సంవత్సరం గరిష్ఠ స్థాయికి ఎదగడం బంగారం ధరలను ప్రభావితం చేశాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు 1,58,200, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,44,510 చేరింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పుణేల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,58,350, 22 క్యారెట్లు రూ. 1,43,960గా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 16,091, 22 క్యారెట్లు - రూ. 14,750, 18 క్యారెట్లు - రూ. 12,335
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,835, 22 క్యారెట్లు- రూ. 14,515, 18 క్యారెట్లు - రూ. 11,876
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,835, 22 క్యారెట్లు- రూ. 14,515, 18 క్యారెట్లు - రూ. 11,876
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,835, 22 క్యారెట్లు- రూ. 14,515, 18 క్యారెట్లు - రూ. 11,876
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,835, 22 క్యారెట్లు- రూ. 14,515, 18 క్యారెట్లు - రూ. 11,876
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,835, 22 క్యారెట్లు- రూ. 14,515, 18 క్యారెట్లు - రూ. 11,876

Click it and Unblock the Notifications