సిద్ధిపేటలో హరీష్ ఘన విజయం
మెదక్: మెదక్ జిల్లా సిద్ధిపేట శాసనసభా నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి హరీష్ రావు భారీ మెజారిటీతో విజయం సాధించారు. హరీష్ రావుకు 30 వేలకు పైగా మెజారిటీ లభించింది. సిద్ధిపేట నియోజకవర్గం తెరాసకు పెట్టని కోట. హరీష్ రావు తెలంగాణవాదాన్ని వినిపించడంలో చాలా ముందున్నారు.
పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడిన తర్వాత ఏమైనా మాట్లాడడానికి వీలుంటుందని హరీష్ రావు చెప్పారు. పోలీంగ్ శాతం తక్కువగా ఉండడం వల్ల కరీంనగర్ లోకసభ ఎన్నికలో ఇబ్బంది ఏర్పడుతోందని ఆయన అన్నారు. దొమ్మాటలో అనుకున్నట్లుగానే గెలుచుకున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications