కెసిఆర్ రాజీనామాపై మాట్లాడ: బాబు

Chandrababu Naidu
ఏలూరు: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్ష పదవికి కె. చంద్రశేఖరరావు రాజీనామా చేయడం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. దానిపై తాను మాట్లాడబోనని చెప్పారు. చంద్రబాబు మీ కోసం యాత్ర బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాలో సాగింది. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, కెసిఆర్ కలిసి ప్రజలను మభ్యపెట్టారని, అవకాశవాద రాజకీయాలకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు. తెలంగాణపై తాము వేసిన కమిటీదే తుది నిర్ణయమని, రాష్ట్ర ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని త్వరలో కమిటీ నివేదిక సమర్పిస్తుందని ఆయన చెప్పారు.

కోటగిరి విద్యాధరరావు తప్పుడు రాజకీయాలకు పాల్పడ్డారని, అందుకే పార్టీ నుంచి పంపించామని ఆయన చెప్పారు. పార్టీలో అవకాశవాద రాజకీయాలకు తావు లేదని, అలాంటివారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం, కేంద్రంలో యుఎన్ పిఎ - వామపక్షాలు అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+