మాదకద్రవ్యాల కేసులో పాక్ క్రికెటర్ ఆసిఫ్ కు క్లీన్ చిట్
International
-Staff
By Staff
దుబాయ్: మాదక ద్రవ్యాలను కలిగివున్నాడనే అనుమానంతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులచే అరెస్టు చేయబడ్డ కుడిచేతి వాటం పాకిస్తాన్ పేస్ బౌలర్ మహమ్మద్ ఆసిఫ్ (25) నిర్ధోషని విచారణలో తేలింది. దుబాయ్ నుండి ఆయన పాకిస్తాన్ ప్రయాణానికి సిధ్ధమౌతున్నారు. "ఆసిఫ్ ని పొరపాటుగా అరెస్టు చేసారని, అనుమానాలన్నీ అవాస్తవాలని రుజువయ్యాక ఆసిఫ్ విడుదల చేయబడ్డాడని" యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎయి)లో పాకిస్తాన్ రాయబారి ఎహసాన్ ఉల్లా ఖాన్ చెప్పారు. ఇటీవలే పూర్తైన ఐపిఎల్ మ్యాచుల్లో డిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఆడిన ఆసిఫ్ జూన్ 2న ముంబాయి నుండి దుబాయ్ మీదుగా పాకిస్తాన్ కు వెళ్తూ మాదక ద్రవ్యాలను కలిగివున్నాడనే ఆరోపణ పై దుబాయ్ లో అరెస్టు చేయబడ్డాడు.దుబాయ్ కస్టమ్స్ అధికారుల కథనం ప్రకారం తన పర్సులో 0.24 గ్రాముల నిశేధిత పదార్దం తో ఆసిఫ్ దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దొరికాడు. ఆసిఫ్ తో దొరికిన పదార్దాన్ని అధికారులు పరీక్షల నిమిత్తంలాబ్ కి పంపారు. ఆసిఫ్ బంగ్లాదేశ్ ఆతిధ్యం వహిస్తున్న భారత్-బంగ్లాదేశ్-పాకిస్తాన్ ల ట్రయాంగ్యులర్ సీరీస్ లో ఆడవలసి ఉంది. ఆ సీరీస్ జూన్ 8న మొదలవుతుంది.