ముంబయి: మాజీ ప్రధాన మంత్రి విపి సింగ్ ముంబయి లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన అమెరికాలో ఒక ఆస్పత్రిలో చికిత్స కోసం వెళ్ళగా, వారు హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీకి విపి సింగ్ ను పంపించారు. ఒకరోజు పాటు హైదరాబాద్ లోని ఆ ప్రైవేటు ఆస్పత్రిలో ఉన్న విపి సింగ్ ను వైద్యులు ముంబయ్ కి తరలించారు. మాజీ ప్రధాని విపి సింగ్ ఇప్పుడు ముంబయ్ లో ని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో హృద్రోగ,కిడ్నీ సమస్యలతో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్ధితి స్ధిరంగా ఉందని ముంబయ్ వైద్యులు చెబుతున్నారు.