మోదీ కేబినెట్ నుంచి 18 మంది ఔట్, నితీశ్ శాఖ ఫిక్స్ - ఏపీ, తెలంగాణ నుంచి వీరే..!!

ప్రధాని మోదీ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. మూడో సారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న వేళ కేబినెట్ ప్రక్షాళన కు సిద్దం అయ్యారు. ప్రభుత్వం.. పార్టీలో మార్పుల కు నిర్ణయించారు. తన కేబినెట్ లోని సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. ప్రస్తుత మంత్రుల్లో 18 మందిని తప్పించనున్నట్లు తెలుస్తోంది. దక్షిణాదితో పాటుగా వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కనుంది. ఏపీ- తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో మార్పులు.. చేర్పుల దిశగా కసరత్తు కొనసాగుతోంది.

కేంద్ర కేబినెట్ లో భారీ ప్రక్షాళన జరగనుంది. ఇందుకు ముహూర్తం ఖరారైంది. ప్రధాని మోదీ ఈ మేరకు పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ తదుపరి కేబినెట్ భేటీలో సంకేతాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయిదు రాష్ట్రాల ఎన్నికల తరువాత.. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల పైన మోదీ ఫోకస్ చేసారు. మారుతున్న లెక్కల తో దక్షిణాది పైన కొత్త వ్యూహాలు అమలు చేయనున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న పలువురు సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. తమిళనాడు నుంచి అన్నామలైకు కేంద్ర మంత్రి పదవి దాదాపు ఖాయమైంది.

union-cabinet-expansion-and-reshuffle-could-take-place-in-the-second-week-of-june-as-latest-reports

అదే విధంగా బీహార్ లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్ కుమార్ కు వ్యవసాయ శాఖ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నీట్ ప్రశ్నపత్రాల లీకులతో అప్రతిష్ట మూటగట్టుకున్న మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను తప్పిస్తారని ప్రచారం సాగుతోంది. కుమారుడి కేసుతో రాజకీయంగా చిక్కుల్లో పడిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ మంత్రి పేరు ప్రచారంలో ఉన్నా.. ఆయన పాత్ర లేకపోవటం తో చర్యలు ఉండవని చెబుతున్నారు.

శ్రీవారి భక్తులకు బిగ్ రిలీఫ్, అలిపిరి వద్ద అందుబాటులోకి కొత్తగా- ఇక ఆ అవసరం లేదు..!!
శ్రీవారి భక్తులకు బిగ్ రిలీఫ్, అలిపిరి వద్ద అందుబాటులోకి కొత్తగా- ఇక ఆ అవసరం లేదు..!!

తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తగా

అదే విధంగా రాజ్యసభ పదవీకాలం పూర్తయిన మంత్రులు, పనితీరులో వెనకబడిన వారిని తప్పించే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీ.. తెలంగాణలోనూ మార్పులు ఉండే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల సమాచారం. తెలంగాణ నుంచి మరో బీజేపీ మంత్రికి కేబినెట్ లో అవకాశం దక్కనుందని చెబుతున్నారు. ఈ సారి సామాజిక సమీకరణాల్లో భాగంగా మహిళా నేతకు మంత్రిగా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా కింజరపు రామ్మోహన్ నాయుడు శాఖ మార్పు... పెమ్మసాని చంద్రశేఖర్ కు స్వతంత్ర హోదాలో పోర్టు పోలియోలు కేటాయించనున్నట్లు సమాచారం. ఏపీ నుంచి మరో మంత్రి కేంద్ర కేబినెట్ లోకి రానున్నారు.

టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో కొనసాగుతున్నారు. ఈ సారి అవకాశం జనసేనకు ఇస్తారని ఢిల్లీ నేతల సమాచారం. పవన్ సైతం అందుకు సిద్దంగా ఉన్నారని చెబుతున్నారు. ఈ మేరకు పవన్ వచ్చే వారం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని.. అక్కడ తుది నిర్ణయం జరుగుతుందని పార్టీ నేతల సమాచారం. దీంతో.. కేంద్ర కేబినెట్ లో చోటు చేసుకునే మార్పుల పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+