ఆర్టీసీ చార్జీలు పెరిగే అవకాశం లేదు: ఎమ్మెస్సార్
హైదరాబాద్: ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచడానికి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి వ్యతిరేకమని ఆర్టీసీ చైర్మన్ ఎం సత్యనారాయణ రావు శనివారం ఇక్కడ తెలిపారు. ఆర్టీసీ వ్యవహారాలపై ఎండీ దినేష్ రెడ్డి, చైర్మన్ సత్యనారాయణ రావు చెబుతున్న విషయాల్లో తేడా ప్రస్ఫ్హుటంగా కన్పించింది. డీజిల్, పెట్రోలు ధరలు పెరగడం వల్ల సంస్ధపై 305 కోట్ల వార్షిక భారం పడుతుందని ఆర్టీసీ ఎండీ దినేష్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ స్ధలాలను అద్దెకు ఇవ్వడం ద్వారా కొంత ఆదాయాన్ని అదనంగా సమకూర్చుకుంటామని ఆయన చెప్పారు. బస్సులలో ప్రయాణికుల సంఖ్య పెంచుకోవడం మరో అదనపు ఆదాయ మార్గమని దినేష్ రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications