పార్టీలో తెలంగాణవాదులపై కుట్ర: గుత్తా
హైదరాబాద్: తెలంగాణవాదులను పార్టీ నుంచి బయటకు పంపేందుకు కుట్ర జరుగుతోందని తెలుగుదేశం పార్టీ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. తమ పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ తో సమావేశమైన అనంతరం ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను తెలంగాణవాదాన్ని వినిపిస్తున్నందుకే తనపై వేటు వేసేందుకు ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు. నల్లగొండ జిల్లా ఆలేరు శాసనసభా నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులు ఓటమికి తాను కారణం కానని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, ఈ విషయంలో జాప్యం చేస్తే పార్టీకి నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. ఉప ఎన్నికలకు ముందు తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో సహా అందరూ తెలంగాణ సెంటిమెంటు ఉందని అన్నారని, ఇప్పుడు కాదంటున్నారని ఆయన అన్నారు. గతంలో రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగుకు పాల్పడ్డవారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications
