ద్రవ్యోల్బణం అదుపుపై చేతులెత్తేసిన కాంగ్రెస్
న్యూఢిల్లీ : గరిష్ఠ స్థాయికి చేరిన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం చాలా కష్టమేనని కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ పరిణామాలు ఆసియాపై చూపుతున్న ప్రభావంతో రాబోయే వారాల్లో మరిన్ని సమస్యలు సృష్టించగలవని ఆ పార్టీ అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ పేర్కొన్నారు. అయితే మిగిలిన ఆసియా దేశాలతో పోల్చితే ద్రవ్యోల్బణం భారత్‌లోనే తక్కువగా ఉందన్నారు. చమురు ధరలు, అంతర్జాతీయ పరిణామాలే ఈ ధరల పెరుగుదలకు కారణమని అభిప్రాయపడ్డారు. ఈ నాలుగైదు నెలలు మినహాయిస్తే ద్రవ్యోల్బణం ఐదు శాతానికన్నా తక్కువగానే ఉందని గుర్తు చేశారు. ఇప్పటికే ఈ ద్రవ్యోల్బణం పలు ఆసియా, ఆఫ్రికా దేశాలను నాశనం చేసిందని చెప్పారు.












Click it and Unblock the Notifications