వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదు భారతీయ భాషల్లో లైవ్ క్రికెట్ స్కోర్స్

By Super
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: వన్ ఇండియాడాట్.ఇన్ అనుబంధ క్రికెట్ పోర్టల్ దట్స్ క్రికెట్ డాట్ కాం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో లైవ్ క్రికెట్ స్కోర్స్ ను అందించే సదుపాయాన్ని ప్రారంభించింది. క్రికెట్ అభిమానులు ఇప్పుడు హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో లైవ్ అప్ డేట్స్ పొందవచ్చు.

"ఐపిఎల్ మ్యాచ్ ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు అతిపెద్ద క్రికెటింగ్ దేశంగా భారత్ సాక్షాత్కరించింది. వన్ ఇండియా డాట్ ఇన్ ఐదు భారతీయ భాషల్లో లైవ్ స్కోర్స్ అందించడం సహజంగా ఉత్సాహాన్ని పెంచుతుంది" అని గ్రేనియం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీస్ సీఇవో బిజి మహేష్ అభిప్రాయపడ్డారు.

క్రికెట్ మ్యాచ్ ఎక్కడ జరిగినా దట్స్ క్రికెట్ డాట్ కాంలో భారతీయ భాషల్లో లైవ్ స్కోర్స్ పొందవచ్చు. బాల్ బై బాల్ అపడేట్స్ నుంచి పూర్తి స్కోర్ కార్డును క్షణాల్లో చూడవచ్చు. వన్ ఇండియా డాట్ ఇన్ ఇటీవల దట్స్ క్రికెట్ డాట్ కాం వాప్ వెర్షన్ ను ప్రారంభించింది. దీనివల్ల మొబైల్ ఇంటర్నెట్ యూజర్లు m.thatscricket.com ద్వారా లైవ్ స్కోర్స్, వచ్చే మ్యాచ్ ల షెడ్యూళ్ళు, సిరీస్ లు, క్రికెట్ వార్తలు పొందవచ్చు.

భారతీయ భాషల్లో తొలిసారిగా పోర్టల్స్ ను ప్రారంభించిన వన్ ఇండియా డాట్ ఇన్ లో ఆన్ లై క్లాసిఫైడ్స్, మొబైల్ పోర్టల్, ఎస్ ఎంఎస్ అప్ డేట్స్, లైవ్ క్రికెట్ స్కోర్స్ పొందవచ్చని బిజి మహేష్ చెప్పారు. "ఇంటర్నెట్ లో భారతీయ భాషాభిమానులకు సమాచార, వినోద విందులు అందించాలన్నది మాలక్ష్యం" అని ఆయన వివరించారు.

వన్ ఇండియా గురించి:
వన్ ఇండీయా డాట్ ఇన్ ( గ్రేనియం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీస్ అనుబంధ సంస్ధ)నేడు ప్రముఖ భారతీయ పోర్టల్- కంటెంట్, కమ్యూనిటీ, కామర్సును భారతీయలకే గాక ప్రవాస భారతీయులకు అందిస్తోంది. వన్ ఇండియా భారతీయ్ భాషా పోర్టల్స్ 2000 సంవత్సరం ఏప్రిల్ నుంచి లైవ్ లో ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X