హైదరాబాద్: చిరంజీవి పార్టీకి అంతా రంగం సిద్ధమైందని చిరంజీవి రాజకీయ సలహాదారు డాక్టర్ మిత్రా బుధవారం మధ్యాహ్నం వెల్లడించారు. పార్టీ గురించి చిరంజీవి త్వరలో స్వయం ప్రకటిస్తారని ఆయన చెప్పారు. ఈనెల్ 7 నుంచి 14 వ తేదీ వరకు చిరంజీవి అభిమానులు ఓటర్ల నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని డాక్టర్ మిత్రా సూచించారు. చిరంజీవి తరఫున నాగబాబు జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. చిరంజీవి జనంలొ తిరగడానికి వీలుగా బుల్లెట్ ప్రూఫ్ వ్యాన్లు సిద్ధమవుతున్నాయి. విదేశాల్లోనూ చిరంజీవి రాజకీయ ప్రవేశం చేయాలని కోరుతూ ప్రవాసాంధ్రులు సమావేశాలు నిర్వహిస్తున్నారు.